భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్ - తారక్ సినిమా

Jr NTR , Trivikram , NTR - Trivikram Joining hands for a new film

         
                     తారక్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేసిన సినిమా అరవింద సమేత , ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గ నిలిచింది . ఇప్పుడు తారక్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గ ఉండగా , త్రివిక్రమ్ ఆలా వైకుంఠపురంలో సినిమా షూటింగ్ లో బిజీ గ ఉన్నాడు . అయితే తారక్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చెయ్యబోయే సినిమా ని ఖరారు చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి , త్రివిక్రమ్ తోనే ఆ సినిమా ఉంటుంది అని సమాచారం .

            ఈ సినిమా అరవిందసమేత లా నార్మల్ బడ్జెట్ సినిమా కాదు అంట , చాల పెద్ద బడ్జెట్ తో ఇంచుమించు గ 200 కోట్ల కి పైగా ఉంటుంది అంట . ఆర్ ఆర్ ఆర్  పాన్ ఇండియా సినిమా అని అందరికి తెలిసిందే , ఈ సినిమా తర్వాత  పక్క రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అనే అంచనా తో ఈ సినిమా తారక్ ఖరారు చేసాడని సమాచారం . ఆర్ ఆర్ ఆర్ లాగే ఈ సినిమా కూడా అన్ని భాషల్లో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు . అయితే ఇంత పెద్ద బడ్జెట్ తో ఎలాంటి సినిమా చేస్తున్నారో తెలియాల్సి  వుంది. 

Post a Comment

0 Comments