ఒక్క సినిమా తో మణిశర్మ కెరీర్ మారిపోయింది

Manisarma , Chiru152 , Balakrishna , Venkatesh


                              మణిశర్మ , ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అయిన , చిన్న హీరో సినిమా అయిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం మణిశర్మ నే . కొన్నేళ్ల పాటు తెలుగు సినిమా లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గ ఎన్నో హిట్స్ ఇచ్చాడు . కానీ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ , థమన్ లాంటి వాళ్ళు రావడం తో స్టార్ హీరోస్ సినిమాలు అన్ని వీళ్ళ ఇద్దరి చేతిలోనే ఉండేవి . మణిశర్మ కి ఇంకా పెద్ద సినిమాలకి అవకాశాలు దొరకడం కష్టం అనే అనుకున్నారు అందరు , కానీ ఇప్పుడు పెద్ద సినిమా లతో మణిశర్మ పేరు మారు మోగుతుంది .

                  ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా  మణిశర్మ కెరీర్ ని మళ్లీ మలుపు తిప్పింది . ఆ సినిమా కి సాంగ్స్ ఎంత ప్లస్ అయ్యాయో అందరికి తెలిసిందే , సాంగ్స్ వల్లే సినిమా ఈ రేంజ్ లో ఆడింది అని సినిమా చుసిన ప్రేక్షకుల అభిప్రాయం . ఇప్పుడు మణిశర్మ కి మూడు పెద్ద సినిమా లు ఆఫర్ లు వచ్చాయని ఇండస్ట్రీ లో వినిపిస్తుంది . చిరంజీవి మరియి కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా , బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ సినిమా , వెంకటేష్ మరియు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో చేస్తున్న అసురన్ రీమేక్ . ఈ మూడు సినిమాలకి మణిశర్మ నే మ్యూజిక్ డైరెక్టర్ అని సమాచారం . ఒకవేళ ఇది నిజం ఐతే మణిశర్మ మళ్లీ పెద్ద సినిమాలతో పూర్వ వైభవం తెచ్చుకోవడం ఖాయం .

Post a Comment

0 Comments