రికార్డు స్థాయి లో వెంకీ మామ బిజినెస్            వెంకటేష్ - నాగచైతన్య ఇద్దరి కలయిక లో వస్తున్నా చిత్రం వెంకీ మామ , ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది , పాటలకి కూడా మంచి స్పందన వస్తుంది . వెంకటేష్ పుట్టిన రోజు సందర్భం గ సినిమా ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు .

             F2 లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వెంకటేష్ , మజిలీ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత నాగచైతన్య ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా బిజినెస్ రికార్డు స్థాయి లో జరుగుతుంది . సీఈడెడ్ హక్కులు 5.4 కోట్లకి అమ్ముడుపోయాయి ,ఆంధ్ర  ఏరియా 17 కోట్ల పైన జరుగుతుంది అని అంచనా వేస్తున్నారు . వరల్డ్వైడ్ ఈ సినిమా 37 నుంచి 40 కోట్ల బిజినెస్ జరిగే లాగ కనిపిస్తుంది . ఇప్పటి తరం బిగ్ స్టార్ట్స్ మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ తో వెంకటేష్ చేసిన మల్టీ స్టార్రర్ లు పక్కన పెడితే  వెంకటేష్ కెరీర్ లో , నాగచైతన్య కెరీర్ లో ఎక్కువ బిజినెస్ జరిగిన సినిమా వెంకీ మామ .

           డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్న కూడా ఈ సినిమా కి  ఇంత  బిజినెస్ జరుగుతుంది అంటే ఈ సినిమా కి ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు . ఐతే ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ ని  అఫిసియల్ గా  అనౌన్స్ చెయ్యాల్సి వుంది.

Post a Comment

0 Comments