మారాల్సింది హీరోల ?? లాభాలను నష్టాలుగా చూపించే నిర్మాతల?? డబ్బు కోసం ఏమైనా రాసే వెబ్సైట్ లా??


         తెలుగు సినిమా పరశ్రమలో ఇప్పుడు కొత్తగా నడుస్తున్న దందా వెబ్సైట్ ల దందా హీరో తరుపున నగదు అందితే ఒకలా లేకుంటే ఒకలా అపోహలు ను వల్లించటం అలవాటుగా మారింది. డిస్ట్రిబ్యూటర్ ల చేతికి డబ్బులు రాకపోయినా కేవలం తమ వెబ్సైట్ లలో వేసుకొని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకోవటం సాధారణం అయిపోయింది అది ఇప్పుడు తార స్థాయికి చేరి ఆ పాపులర్ ఐన వెబ్సైట్ లకి తమ సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లేదా అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ లు  ఇవ్వకపోయినా లేదా పాజిటివ్ రివ్యు లు రాయటానికి నగదు  ఇవ్వకపోయినా లేని పోని అపోహలు వక్రీకరించి రాయటం మొదలు పెట్టారు.

        ఇటీవల ఒక వెబ్సైట్ ఒక ప్రముఖ కథానాయకుడు గురించి మంచి నటుడు ఐతే సరిపోదు మంచి మనిషి అని పించుకోవాలి అని ఒక కథనాన్ని ప్రచురించింది అది ఎంత వరకు నిజమో వారికే తెలియాలి హైదరాబాద్ లో వేసిన ఒక సెట్టు కి అమెరికా లో తీసిన పది రోజుల షెడ్యుల్ కి 150 కోట్ల బడ్జెట్ ఐయ్యింది ఆ హీరో నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి అని రాస్తే అదే నిజం అని నమ్మ టానికి వాళ్ళకి జనాలు ఎలా కనపడుతున్నారొ వాళ్ళకే తెలియాలి .ఇంతలా నిర్మాతల గురించి సదరు వెబ్సైట్ అదే హీరో నటించిన సినిమా రిలీజ్ ఐన రోజు ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్ ఐయ్యింది అని రివ్యూ లు ఇచ్చింది అప్పుడు వాళ్ళకి నిర్మాతల యోగక్షేమాలు గుర్తురాలేదేమో.

       దీనికి అసలు కారణం నిర్మాత దిల్ రాజు బడ్జెట్ నాకు 140 కోట్లు అయ్యిందని చెప్పి బిజినెస్ మొదలుపెట్టడం నిజంగా అంత బడ్జెట్ ఐతే ప్రొడ్యూసర్స్ కి ఏమి మిగలదు కానీ అశ్వినీదత్ మాత్రం బడ్జెట్ లెక్కలు నాకు తెలియవా నా లాభాల వాట నాకు ఇవ్వమని అడగటం తో మహర్షీ ని టేబు ల్ లాస్ గా చూపించి మహేష్ బాబు తర్వాతి సినిమాలో పార్టనర్షిప్ అడుగుదాం అనుకున్న దిల్ రాజు కి ఎం  చేయాలో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఇదంతా మహేష్ బాబు కి తెలియటం తో ముగ్గురు నిర్మాతలని కలిసి బడ్జెట్ మరియు బిజినెస్ లెక్కలు కనుక్కొని  తన తర్వాతి సినిమాలో కేవలం ఒక నిర్మాత వుండేటట్లు సమస్యని పరిష్కరిస్తునడాని సమాచారం
అప్పులు చేసి అడ్వాన్స్ లు ఇచ్చే నిర్మాతలు లాభాలు లేకుండా సినిమా ఎలా తీస్తారు అని ఆలోచించి వుంటే అటువంటి  వల్లించిన (కథ)నాలు రాయవలసిన అవసరం ఉండేది కాదు .

      కాబట్టి మారాల్సింది హీరోలు, నిర్మాతలు కాదు మనకు డబ్బులు ఇస్తే ఒకరకంగా ఇవ్వకపోతే ఇంకో రకంగా రాసే వెబ్సైట్లు , టేబుల్ ప్రాఫిట్ ఉన్న మూవీ ని లాస్ గా చూపించి సహా నిర్మాత లకు ఏమి ఇవ్వని నిర్మాతలు

Post a Comment

0 Comments