RRR మూవీ ప్రెస్ మీట్ విశేషాలు


       దర్శకధీరుడు రాజమౌళి (R), యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు (R), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (R) కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR మూవీపై (ప్రచార టైటిల్) జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది.

బాహుబలి చిత్రం తరువాత దర్శకధీరుడు టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ సినిమాను భారీ హంగులతో రూపొందిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఈ సినిమా ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా, షూటింగ్ జరుపుకుపోతున్నారే తప్ప, చిత్రానికి సంబంధించిన విషయాలను సీక్రెట్‌గానే ఉంచారు. ఈ చిత్ర కథ, పాత్రలు, హీరోయిన్స్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తెలియజేయడానికి ఈరోజు RRR టీం మీడియా ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. ఆ విశేషాలు మీ కోసం.


నేపధ్యం: ఈ చిత్రం ఇద్దరు  స్వతంత్ర పోరాట యోధులు అయినా  అల్లూరి సీత రామ రాజు మరియు కొమరం భీం  లు కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఉండబోతుంది అని రాజమౌలి చెప్పారు.

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు, కాగా ఈ చిత్రం 1920 కాలం నాటి సంఘటనలు ఆధారం ఉండబోతుంది అని తెలుస్తుంది .

 కాస్టింగ్: రామ్ చరణ్ సరసన  బాలీవూడ్ బ్యూటీ అలియా బట్ , జూనియర్ ఎన్టీఆర్ సరసన  హాలీవుడ్ హీరోయిన్ డయానా ఎడ్గార్ జోన్స్ నటించబోతున్నారు , మరియు ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ హీరో అయినా అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్రలు చేయబోతున్నారని రాజమౌళి తెలియా చేసారు.


విడుదల : ఈ చిత్రాన్ని 30 జులై, 2020 తేదీన ప్రధాన భాషలు అన్నింట్లో విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Post a Comment

0 Comments