ఎన్టీఆర్ కథానాయకుడు డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకున్న బాలయ్య..


       ఎన్టీఆర్ కథానాయకుడు ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల ఐన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర కావటం అందులోనూ బాలయ్య, రానా , విద్యాబాలన్ ఇలా ప్రధాన తారాగణం నటించడం మరియు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ ఐన సంక్రాంతి కి విడుదల కావటంతో బయ్యర్లు భారీ మొత్తానికి చిత్రాన్ని కొనుగోలు చేశారు తీరా రిలీజ్ అయ్యాక పోసిటివ్ టాక్ తో కూడా భారీ నష్టాలని కూడగట్టుకుంది.

ఆ నష్టాలని భరించటానికి బాలయ్య కేవలం ముందు చెప్పినట్టు రెండో భాగం ఉచితంగా ఇవ్వటమే కాకుండా మొదటి భాగం మిగిల్చిన నష్టాలను కూడా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.

మొదటి భాగం నష్టాలలో 35% నగదు రూపం లో ఇచ్చి రెండో భాగం కలెక్ట్ చేసిన దాంట్లో 40% డిస్ట్రిబ్యూటర్స్ 60% ప్రొడ్యూసర్స్  పంచుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

అగ్రిమెంట్ గురించి పూర్తి వివరాలను ట్రాక్ టాలీవుడ్ బృందం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ని క్లుప్తంగా అడగటం జరిగింది.
ఆయన వివరణ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు సిడెడ్ ఏరియా హక్కులను 12 కోట్లకు దక్కించుకోటం జరిగింది కానీ 2 కోట్లను మాత్రమే కలెక్ట్ చెయ్యగలిగింది ఇప్పుడు ఆ 10 కోట్ల నష్టాన్ని బాలయ్య 35% అనగా 3.5 కోట్లను నగదు రూపం లో రెండో భాగం రిలీస్ అయ్యాక కలెక్ట్ చేసిన దాంట్లో 40% (5 కోట్లు కలెక్ట్ చేస్తే 2 కోట్లు డిస్ట్రిబ్యూటర్ కి 3 కోట్లు ప్రొడ్యూసర్స)డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేతట్టు అగ్రిమెంట్ జరిగింది అని వివరించారు.

అంటే ఎన్టీఆర్ మహనాయకుడు ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత నష్టాలను డిస్ట్రిబ్యూటర్స్ పూడ్చుకోగలరు అన్నమాట.
     

Post a Comment

0 Comments