తండ్రి సినిమా కి తండ్రి పెట్టిన పార్టీ ఎ దిక్కు


             ఎన్టీఆర్ ఈ పేరుకి ఉన్న చరిత్ర గురించి ఎంత మాట్లాడకున్న తక్కువే ఇదే పేరుని ప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు మరియు తెలుగు తమ్ముళ్లు కారణం బాలయ్య తీసిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర.

ఎన్నో అంచనాల మధ్య మొదలయ్యిన సినిమా తీరా తెర పై పడ్డాక ఎవరు ఊహించని రీతిలో బొక్క బోర్లా పడ్డది.

చిత్రం అపజయానికి కారణాలు ఏవైనా ఈ చిత్రం ద్వారా ఎన్నికల్లో లాభం పొందుదాం అనుకున్న చంద్రబాబు కి మాత్రం ఈ చిత్రం ఘోర విఫలం కావటం ఎ మాత్రం మింగుడు పడటం లేదు
కానీ చంద్రబాబు మాత్రం ఈ చిత్రాన్ని ఎలాగైనా జనాలకి చూపించి తాను అనుకున్న లాభాన్ని చేకూర్చుకోవాలని జరిగిన నష్టాన్ని పూడ్చటానికి సన్నదమయ్యారు.

అన్ని జిల్లాల్లో టీడీపీ ఇంచార్జి లకు మహనాయకుడు చిత్రాన్ని ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించాలని దాని కొరకు అయ్యే ఖర్చును ఇంఛార్జి లు భరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏది ఏమైనా అసలు ఏమి రాదనుకున్న చిత్రానికి ఎంతో కొంత వస్తుండడం తో చిత్రాన్ని కొన్న బయ్యర్లు సంతోషంగా ఉన్నారు.


తండ్రి సినిమా కి తండ్రి పెట్టిన పార్టీ ఎ దిక్కుఅవుతుంది అని బాలయ్య కూడా ఊహించి ఉండడు.


Post a Comment

0 Comments