షాక్ లో టీడీపీ పార్టీ శ్రేణులు - లక్ష్మి'స్ ఎన్టీఆర్ ట్రైలర్ విశ్లేషణ..


రామ్ గోపాల్ వర్మ మునుపటి చిత్రాలు వంగవీటి , రక్త చరిత్ర వలె లక్ష్మి'స్ ఎన్టీఆర్ కూడా ఉండబోతుంది ఊహించిన వాళ్ళకి ఈరోజు రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తే ఎన్టీఆర్ నిజ జీవితం లో జరిగిన అన్ని ముఖ్య సంఘటనలని తీసినట్టు అర్ధం అవుతుంది

ఇంకా ఈరోజు రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తా ఉంటె  ప్రస్తుత  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ని  ఈ చిత్రం లో ప్రతి నాయకుడు అని అర్ధం అవుతుంది.

చిత్రం మొత్తం లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితం లో అడుగు పెట్టినప్పటి నుంచి  ఎన్టీఆర్ చనిపోయేంత వరకు ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇంకా ఈ చిత్రం లో తెలుగు దేశం పార్టీ ఎన్నికల గుర్తు ఐన సైకిల్ చిహ్నం ఎలా పోగొట్టుకున్నాడు, దాన్ని  తన అల్లుడు ఐన చంద్ర బాబు ఎలా దక్కించుకున్నాడు లాంటి సన్నివేశాలు తీశారు అనే చర్చలు ఇండస్ట్రీ లో నడుస్తున్నాయి.దీనితో ఒక్కసారిగా ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి.

అసలు ఈ చిత్రం విడుదల అవదు అని టీడీపీ పార్టీ అభిమానులు అనుకుంటా ఉంటె, మరి కొందరు ఇది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ది కోసం చంద్ర బాబు పై మీద దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

కొంత మంది ఇందులో నిజం ఉంది అని, రామ్ గోపాల్ వర్మ శెభాష్ అని అంటున్నారు.

ఈ చిత్రం అసలు విడుదల  అవుతుందో లేదో , విడుదల అయినా ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Post a Comment

0 Comments