ఇలా ఐతే ఎలా బాలయ్య


             ఎన్టీఆర్ కథానాయకుడు ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల ఐన సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర కావటం అందులోనూ బాలయ్య, రానా , విద్యాబాలన్ ఇలా ప్రధాన తారాగణం నటించడం మరియు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ ఐన సంక్రాంతి కి విడుదల కావటంతో బయ్యర్లు భారీ మొత్తానికి చిత్రాన్ని కొనుగోలు చేశారు తీరా రిలీజ్ అయ్యాక పోసిటివ్ టాక్ తో కూడా భారీ నష్టాలని కూడగట్టుకుంది .
ఇదిలా ఉండగా మొదటి భాగం కొనేటప్పుడే బాలయ్య నష్టాలు వస్తే రెండో భాగం తక్కువ ధర కి లేదా ఉచితంగా ఇస్తాను అని చెప్పటం తో బయ్యర్లు కూడా భయపడకుండా ఎక్కువ ధరకు హక్కుల్ని దక్కించుకున్నారు

కానీ ఇప్పుడు మాత్రం కేవలం పశ్చిమ గోదావరి , నైజాం ఏరియా లు మాత్రమే తొలి భాగం డిస్ట్రిబ్యూట్ చేసిన ఉషా పిక్చర్స్ మరియు ఆసియన్ సినిమాస్ కి రెండో భాగం ఇచ్చి మిగతా ఏరియా లు అన్ని సురేష్ బాబు ద్వారా రిలీస్ చేస్తున్నట్టు సమాచారం.

ఇలా ఐతే మా పరిస్థితి ఏంది బాలకృష్ణ గారు అని మొదటి భాగం పంపిణీదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మార్చి ఒకటో తారీకున విడుదల చెయ్యాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ వారాంతం లో ప్రి రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

మొదటి భాగం పంపిణీదారులు పరిస్థితి ఏంది అని టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది చూడాలి బాలయ్య ఎం చేస్తాడో.

Post a Comment

0 Comments