మహర్షి టీజర్ ఆరోజేన


మహర్షి చిత్రబృందం ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుపుకుంటుంది.
ఈ షెడ్యూల్ లో ద్వితీయ భాగం లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు మిత్రుడు అల్లరి నరేష్ ని కాపాడటానికి చేసే పోరాట సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి .
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ శివరాత్రి కానుకగా విడుదల చెయ్యటానికి చిత్రబృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది దాని కొరకు మహేశ్ బాబు మరియు ప్రధాన తారాగణం డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు అని సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ ప్రసార హక్కుల్ని ప్రముఖ సంస్థా అమెజాన్ ప్రైమ్ వారు భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
సినిమా విడుదల ఐన 50 రోజుల తర్వాత ఆన్లైన్లో లో రిలీజ్ చేసేటట్టు ప్రొడ్యూసర్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
చిత్రబృందం సినిమా విడుదలకు ఏప్రిల్ 25 మరియు మే 10 వ తారీకు ని పరిశీలిస్తున్నారు.

Post a Comment

0 Comments