మహేష్ తదుపరి చిత్రం ఎవరితో? - Track Tollywood

Post Top Ad

మహేష్ తదుపరి చిత్రం ఎవరితో?

Share This  మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 వ  చిత్రం సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ కలియక లో చేస్తున్నాడు అన్న విషయం మన అందరకి తెల్సిందే.

మహేష్ కథ ఏమి వినకుండా సుకుమార్ చిత్రాన్ని ఖాయం చేసినట్టు తెలిసింది,  తర్వాత మహేష్  కి తెలంగాణ  రజాకార్ల పోరాట నేపధ్యం లో మరియు  ఎర్ర చందనం అక్రమ రవాణా నేపధ్యం లో రెండు లైన్స్ వినిపించినట్టు తెల్సింది , ఇందులో మహేష్ కి ఎర్ర చందనం అక్రమ రవాణా నేపధ్య లైన్ నచ్చి దాన్ని ఖాయం చేసి, పూర్తి కథ తో రమ్మని చెప్పినట్టు తెల్సింది.

ఇప్పుడు మహేష్ తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి తో చేసే ఆలోచన లో ఉన్నాడు, ఈ విషయమై ట్రాక్ టాలీవుడ్ బృందం ఆరా తీయగా కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకి తెలిసాయి.

గత వారం సుకుమార్ పూర్తి కథ వినిపించగా మహేష్ కి కథ నచ్చక కొన్ని మార్పులు చెప్పినట్టు, సుకుమార్ మరి కొంత సమయం అడగటం తో , ఈలోగా అనిల్ రావిపూడి చిత్రాన్ని దిల్ రాజు / అనిల్ సుంకర మరియు మహేష్ బాబు ప్రొడక్షన్స్ లో త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ కి విడుదల చేసి, ఆ తర్వాత సుకుమార్ సినిమా ని ఖాయం చేసే ఆలోచన లో ఉన్నాడు మహేష్ బాబు

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages